నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..


మహా పండితులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటకు నిలువు టద్దంగా నిలిచాయి ఓట్ల బేరసారాలు...

   మొన్నటి వరకు నీతి నిజాయితీ,ప్రజా సేవ,సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని గప్పాలు కొట్టి..పోలింగ్ సమీస్తున్న వేళ బరితెగించారు.. ప్రజా స్వామ్యాన్ని నిలువునా పాతర వేస్తున్నారు..పైసలు పంచితేనే ఓటర్లు కనికరిస్తారని కాబోలు..ఇండిపెండెంట్లు సైతం పచ్చ నోట్ల పందేరానికి తెర తీశారు.ఇండిపెండెంట్లే ఇట్లా బరితెగిస్తుంటే.. ఇక ప్రధాన పార్టీ అభ్యర్థులైతే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రచార పర్వానికి తెరపడిందో లేదో నోట్ల కట్టలతో ఓటర్ల ముంగిట్లో వాలారు గద్దల్లా..ఓటుకు వెయ్యి నుంచి మొదలుకొని రెండు వేల వరకు పంచి పెట్టారు..నిజామాబాద్ నగరంలో అయితే సందేట్లో సడెమియ్య అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటే ఏ మేరకు ఓట్ల కొనుగోలు వ్యవస్తీకృతము అయ్యిందో అర్థము అవుతోంది..

జనరల్ ఎన్నికలను తలదన్నే స్థాయిలో ఓట్ల కోసం బేరసారాలు జరిగాయి. అన్ని పార్టీలు ఒకే తానులో గుడ్డలే అనే సామెత సరిపోయింది.. అన్ని పార్టీలు అక్రమంగా ఓట్లను కొనుగోలు కోసం బరిలో నిలిచాయి కాబట్టి..తేలు కుట్టిన దొంగల్లా గప్ చుప్ గా పని కానించాయి..

మునిసిపల్ కార్పొరేషన్ పాలన అవినీతి మయం అయ్యిందని.. గెలిచిన కార్పొరేటర్లు  అవినీతికి పాల్పడితే తోలు తీస్తానని బహిరంగ సభల్లో ప్రకటించిన పార్టీ కూడా ఓట్ల బేరానికి బాహాటంగానే  దన్నుగా నిలిచింది.

 ఇదిలా ఉంటె ఘనత వహించిన ఓటరు మహాశయులు కూడా తక్కువేమీ కాదు..ఓటుకు నోటు ఎక్కడ మిస్సవుతుందోనన్న బెంగతో పంపిణీ రాయుళ్ల కోసం ఇంటి ముందే చకోరా పక్షుల్లా నిరీక్షించారు..

  అందుకే మహానుభావుడు రాసిన "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..

అగ్గితోటి కడుగు సమాజ జీవశ్చవాన్ని" పాటను గుర్తు చేసుకోవడం మినహా.....?

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్