Posts

Showing posts with the label exam updates

పకడ్బందీగా తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి

Image
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏప్రిల్, మీ 2026 విషయాలపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. డి ఆర్ డి ఏ పి డి సాయ గౌడ్, డిఇఓ అశోక్ జిల్లా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. వాటికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం డిఆర్డిఏ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel