Posts

Showing posts with the label first female citizen of Nizamabad

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు

Image
  (జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి) ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ  మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు..   గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి. స్నేహితులు,హితులు వారిద...