Posts

Showing posts with the label kuragayala uma

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

Image
(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు) పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.  NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది.. వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది.. ...