Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ


(జమాల్పూర్ గణేష్, రాజేంద్ర బాబు)

పీసీసీ చీ ఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రాంగం ఫలించింది. మజ్లీస్ పార్టీతో జతకట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది.ఆ పీఠంపై అతి సాధారణ మహిళ కూరగాయల ఉమా రాణిని కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ.నలభై ఏళ్లుగ మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత నమ్మిన బంటుగా కొనసాగుతూ వస్తున్న కసాబ్ గల్లీ కరాటే రమేష్ సతీమణిని అసాధారణ రాజకీయ సమీకరణాలు మేయర్ పదవికి  దరిచేర్చింది.

మహేష్ కుమార్ గౌడ్ కు ఆత్మగా వ్యాపార దిగ్గజంగా ఉన్న కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణి ని మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు.. అయితే ఆమె కార్పొరేటర్ గా గెలవలేక పోయింది.20 కోట్లు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడంతో సాధారణ మహిళ కార్పొరేటర్లు ఉమారాణి,పంచ రెడ్డి లలిత, పూజిత గౌడ్ మేయర్ పదవి కోసం పోటీపడ్డారు.

 NSUI,యూత్ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంచ రెడ్డి చరణ్ సతీమణి లలిత కు దాదాపుగా పదవి ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది..

వరుసగా మేయర్ పదవిని మూడు సార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అనుభవించడం లలిత అవకాశాలను నీరు గార్చింది..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమికరణాలను పరిగణనలోకి తీసుకుని మొదటిసారిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ సీటును ఇవ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుందని మహేష్ భావన.. ఈ సమికరణాలను సీఎం ముందుంచి తాను కోరుకున్న ,నమ్మిన బంటుగా ఉన్న కరాటే రమేష్ సతీమణి కి లైన్ క్లియర్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.. అన్నీ తానే అయ్యి నిజామాబాద్ మునిసిపల్ ఎన్నికలను నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ మేయర్ పదవి ఖరారు చేయడంలో సింగిల్ హ్యాండ్ గా వ్యవహరించారు.

  నిజానికి నిజామాబాద్ అర్బన్ ఇంచార్జి గా ఉన్న షబ్బీర్ అలీ సైతం ఈ ఎన్నికల్లో నామ మాత్రంగా మిగిలి పోయారు. కామారెడ్డి బల్దియా ఎన్నికలకు షబ్బీర్ అలీని పరిమితం చేశారు.

    ముదిరాజ్ ముద్దు బిడ్డ

 మేయర్ ఉమారాణి భర్త రమేష్ 40 ఏళ్ల కింద మహేష్ కుమార్ గౌడ్ వద్ద కరాటే నేర్చుకున్నారు.. బ్లాక్ బెల్ట్ మాస్టర్ మహేష్ గౌడ్ శిష్యుడిగా కామారెడ్డిలో ఒకినవా కరాటే శిక్షకుడిగా పనిచేశారు. అప్పటి నుండి కరాటే శిక్షకుడిగా, NSUI లో మహేష్ గౌడ్ నాయకత్వంలో విద్యార్థి నాయకునిగా పనుచేస్తూ..ఇప్పటికీ కంగ్రెస్ చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు..ఎప్పుడూ మహేష్ గౌడ్ మనిషిగానే ముద్ర వేసుకుని మరీ మెదిలారు.అదే నమ్మకం రమేష్ ను అందలం ఎక్కించడానికి మార్గాన్ని సుగమం చేసింది.

తెలంగాణ ఉద్యమంలో మరీ ముఖ్యంగా సకల జనుల సమ్మెలో కరాటే రమేష్ కీలక పాత్ర పోషించారు.ఉమ్మడి జిల్లా వ్యాపితంగా ముదిరాజ్ లను ఉద్యమంలో మమేకం చేశారు. చేపల వలలు భుజాన వేసుకున్న వందలాది మంది ముదిరాజ్ లను తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచారు.

ముదిరాజ్ అగ్ర నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి తెలంగాణ వ్యాపితంగా ముదిరాజ్ ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణలో బీసీ జనాభాలో అధిక సంఖ్యలో 50 లక్షలు ఉన్నా సరైన రాజకీయ గుర్తింపు లేదని వందలాది సభల్లో గళ మెత్తిన కరాటే రమేష్ సతీమణి ఉమారాణి ముదిరాజ్ ను మేయర్ పీఠం వరించడం తెలంగాణలో అరుదైన రాజకీయ సమీకరణకు నిదర్శనం..




Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన