Posts

Showing posts with the label nizamabad press club

ప్రతి రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనీ వక్తల పిలుపు

Image
మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబరచాలని, మహిళలు అన్ని రంగాల్లో గౌరవింపబడాలని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, న్యాయవాది, పి పి నీరజ రెడ్డి, ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత, అర్బన్ సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్స్ జ్యోతి, రాజేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు. మొదట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రెస్ క్లబ్లో ఆనవాయితీగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగద...

జర్నలిస్టులకు పక్కాగా ఇండ్ల స్థలాలు.. Pcc చీఫ్ మహేష్,షబ్బీర్ అలీ

Image
తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని pcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించన తరువాత వారు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ చెప్పారు.ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వారు గుర్తు చేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాళ సాయంత్రం కలెక్టర్ ను పిలిచి మాట్లాడుతామని వారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసిన జర్నలిస్టులకు ప్రజా పాలనలో మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లు సైతం కాంగ్రెస్ అధికారమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.380 కోట్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు మహేష్ చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తా...