జర్నలిస్టులకు పక్కాగా ఇండ్ల స్థలాలు.. Pcc చీఫ్ మహేష్,షబ్బీర్ అలీ
తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని pcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించన తరువాత వారు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుతామని మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ చెప్పారు.ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వారు గుర్తు చేశారు.
నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాళ సాయంత్రం కలెక్టర్ ను పిలిచి మాట్లాడుతామని వారు మాట ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసిన జర్నలిస్టులకు ప్రజా పాలనలో మేలు జరుగుతుందని చెప్పారు.
వచ్చే ఐదేళ్లు సైతం కాంగ్రెస్ అధికారమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.380 కోట్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు మహేష్ చెప్పారు.
తన నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టరు భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. స్థలాల గుర్తింపు కోసం అధికారులకు చెప్పానని ఆయన అన్నారు.
10 ఏళ్ళు TRS పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త అన్నారు. ఈ ప్రభుత్వమైనా సీరియస్గా తీసుకుని ఇండ్ల స్థలాలు ఇచ్చి జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యగా మారిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శుభాస్, కోశాధికారి రాజ్ కుమార్,ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు తో పాటు కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
వెల్నెస్ హాస్పిటల్ ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే ఉచిత వైద్యం కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ లాంఛనంగా ప్రారంభించారు.వెల్నెస్ ఎండి అసద్,డైరెక్టర్ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రీ హెల్త్ కార్డును ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి,నుడా చైర్మన్ కేశ వేణు, పార్టీ నేతలు తాహెర్ బిన్ హందాన్,నగేష్ రెడ్డి,బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్,ముప్ప గంగారెడ్డి, జావేద్ అక్రమ్, ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు.
