Posts

Showing posts with the label patient death after surgery

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూరు రాజేంద్రబాబు) నిజామాబాద్ లో ఒక వైద్యుడు లేవనెత్తిన అంశాలు...సంధించిన ప్రశ్నలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో తీవ్ర ప్రకంపనలకు దారితీసింది.IMA పనితీరు, సంక్లిష్టమైన సందర్భాలను సమన్వయం చేయడంలో అనుసరించ వలసిన తీరు , నాయకత్వ బాధ్యతల్లో దాగి ఉన్న డొల్ల తనం బయట పడింది. నిజామాబాద్ జిల్లా వైద్య రంగ చరిత్రలోనే అత్యంత కాస్లీ ప్రాణ పరిహారంగా రికార్డు కెక్కిన ఉదంతం ఇప్పుడు వైద్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.....డాక్టర్ల దుబాయ్ గా పేరుపడ్డ నిజామాబాద్ ఖాళీల్ వాడి లోని ద్వారక ENT హాస్పిటల్ కు ఫిబ్రవరి 25 న భీంగల్ మండలం పల్లిగొండ యువకుడు చెవి సమస్యతో వెళ్లారు.. చెవి సమస్యకు ఆపరేషన్ జరిగింది..ఆ తరువాత పేషేంట్ మృతి చెందారు.దీనితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితుల తరపున నలుగురు కార్పొరేటర్లు ద్వారక హాస్పిటల్ యజమాని,ఆపరేషన్ చేసిన డాక్టరు నవీన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు.మానవతా కోణంలో జిల్లాలో ఎప్పుడు ఇవ్వనంతగా 23 లక్షల పరిహారం చెల్లించడానికి ఒప్పందం కుదిరింది.. అంత వరకు బాగానే ఉంది.కానీ నిజామాబాద్ లో పుట్టి,పెరిగి ఇక్కడే వైద్య ప్రముఖుడిగా ...