IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

(జమాల్పూర్ గణేష్ మూల్పూరు రాజేంద్రబాబు)
నిజామాబాద్ లో ఒక వైద్యుడు లేవనెత్తిన అంశాలు...సంధించిన ప్రశ్నలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో తీవ్ర ప్రకంపనలకు దారితీసింది.IMA పనితీరు, సంక్లిష్టమైన సందర్భాలను సమన్వయం చేయడంలో అనుసరించ వలసిన తీరు , నాయకత్వ బాధ్యతల్లో దాగి ఉన్న డొల్ల తనం బయట పడింది. నిజామాబాద్ జిల్లా వైద్య రంగ చరిత్రలోనే అత్యంత కాస్లీ ప్రాణ పరిహారంగా రికార్డు కెక్కిన ఉదంతం ఇప్పుడు వైద్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.....డాక్టర్ల దుబాయ్ గా పేరుపడ్డ నిజామాబాద్ ఖాళీల్ వాడి లోని ద్వారక ENT హాస్పిటల్ కు ఫిబ్రవరి 25 న భీంగల్ మండలం పల్లిగొండ యువకుడు చెవి సమస్యతో వెళ్లారు.. చెవి సమస్యకు ఆపరేషన్ జరిగింది..ఆ తరువాత పేషేంట్ మృతి చెందారు.దీనితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితుల తరపున నలుగురు కార్పొరేటర్లు ద్వారక హాస్పిటల్ యజమాని,ఆపరేషన్ చేసిన డాక్టరు నవీన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు.మానవతా కోణంలో జిల్లాలో ఎప్పుడు ఇవ్వనంతగా 23 లక్షల పరిహారం చెల్లించడానికి ఒప్పందం కుదిరింది.. అంత వరకు బాగానే ఉంది.కానీ నిజామాబాద్ లో పుట్టి,పెరిగి ఇక్కడే వైద్య ప్రముఖుడిగా స్థిరపడిన తనకు IMA నుంచి నైతిక మద్దతు లభించలేదని డాక్టరు నవీన్ రెడ్డి పడ్డ మనో వేదన అంతా ఇంతా కాదు. గతంలో నిజామాబాద్ లో ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు IMA జోక్యం చేసుకుని బాధితులతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించిన సందర్భాలున్నా..తనను మాత్రం వైద్య సమాజం గలికొదిలేసిందని నవీన్ రెడ్డి కుంగి పోయారు.. బరువెక్కిన మనస్సుతో డాక్టర్ల సంఘం అయిన IMA కు సుదీర్ఘ మైన మెస్సేజిని వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేయడం సంచలనాత్మకంగా మారింది. సర్జరీ పార్టుకు సంబంధించి తన వైపునుంచి ఎలాంటి లోపం లేదని స్పష్టం చేస్తూనే అనస్తీషియా పార్టును ప్రస్తావించారు నవీన్ రెడ్డి. పేషేంట్ మృతికి తానే బాద్యుడనే రీతిన వ్యవహరించి..ఆపరేషన్ టీమ్ స్పిరిట్ కు భిన్నంగా వ్యవహరించారని అనస్తీషియా నిపుణురాలి తీరుపై విభేదించారు. వైద్య వృత్తి ప్రమాణాలు, రక్షణల విషయాలను సుతిమెత్తగా బహిర్గతం చేశారు.భావం మాత్రం ఘాటుగా ఉండడం వైద్య వర్గాల్లో సంచనం రేపింది. అన్నిటికీ మించి బాధిత కుటుంబానికి బాసటగా నిలవడడాని, పరిహారం భరించే విషయంలో ఆర్థిక భారం నవీన్ రెడ్డి మీద పడింది.. దీన్ని కూడా సమిష్టి బాధ్యత కోణంలో IMA చర్చ పెట్టిన తరువాత సహ నిపుణురాలు కూడా వేడినీళ్లకు చన్నీళ్ల వలె చేయూత ఇయ్యక తప్పలేదు.. ఈ పరిణామాల నేపథ్యంలో IMA నిర్వర్తించ వలసిన బాధ్యత మీద కూడా చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. పేషేంట్లు మృతి చెందిన సందర్భాల్లో సదరు హాస్పటల్స్ కు బాసటగా నిలవడడం సర్వ సాధారణం.పరిహారం విషయంలో బాధితులు మొండికేస్తే పోలీసుల సహకారం తీసుకోవడం..అడిగినంత ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పి కేసు పెట్టుకొండని ఒత్తిడి చేయడమూ సర్వ సాధారణం. ప్రాణము ఖరీదు కట్టలేము. ద్వారక యాజమాన్యం చెల్లించే పరిహారం ప్రాణంతో పోల్చలేము. కానీ నవీన్ రెడ్డి వ్యవహారంలో IMA ఎలాంటి పాత్ర పోషించిందో భవిష్యత్తు ఆపరేషన్లు వికటించి మరణాలు సంభవించిన్నపుడు కూడా కొనసాగిస్తే బాధితులకు మేలైనా జరుగుతుంది.. కానీ అట్లా ఉంటదన్న గ్యారంటీ లేదు. మారని మీడియా తీరు; హాస్పిటల్స్ వ్యవహారాలలో మీడియా అతి జోక్యం కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద మవుతోంది. మెడికో లీగల్ అంశాలపై అవగాహన కొరవడడం,ఆపరేషన్లు వికటించి మరణాలు సంభవించిన సందర్భాల్లో వృత్తి విలువలకు తిలోదకాలు ఇస్తున్న తీరు తల వంపుగా మారింది. ద్వారక సంఘటనలోనూ పునరావృతం అయినట్లు కూడా వైద్య వర్గాల్లో ప్రచారం ఉంది.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్