Posts

Showing posts with the label secret meeting

ఇద్దరిదీ దొడ్డిదారే.. దాయాదుల దోస్తాన..

Image
రహస్యంగా కార్పొరేషన్ సమావేశం.. ప్రజాస్వామ్యానికి విఘాతం? పార్లమెంట్ కన్నా స్థానిక పాలన వ్యవస్థలకు ప్రజాస్వామ్యంలో,రాజ్యాంగ స్ఫూర్తిలో పెద్దన్న పాత్ర.. కానీ ఆ స్ఫూర్తిని BRS సర్కార్ నిలువు పాతర వేయగా.. రాజకీయాల్లో దాయాదిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాత సర్కారు ఒరవడిని కొనసాగించడం విశేషం.. ప్రజా పాలన ట్యాగ్ లైన్ ను అన్ని వేదికలపై అరగిన గ్రామ ఫోన్ రికార్డు వలె వల్లించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.. తెలంగాణలో మునిసిపల్ పాలక వర్గ సమావేశాలను రహస్యంగా నిర్వహించే చెత్త సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి పాలక వర్గ వసమావేశం పోలీసు పహారాలో జరిగింది. .సమావేశం ప్రధాన ద్వారం మూసేసి..ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కిటికీలు సైతం మూసేసారు.. లోపల జరిగే చర్చలు బయటకు వినబడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. దర్వాజాలు బందు పెట్టి ప్రజా బిసమస్యలను చర్చించాల్సిన అగత్యం ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చను నేరుగా ప్రజలకు చేరనియ్యకుండా ఉండేందుకు మీడియాను అనుమతించలేదు.. పారదర్శకంగా,పబ్లిక్ ఉన్నది ఉన్నట్లు తేలుసుకునే హక్కును హరిస...