ఇద్దరిదీ దొడ్డిదారే.. దాయాదుల దోస్తాన..

రహస్యంగా కార్పొరేషన్ సమావేశం.. ప్రజాస్వామ్యానికి విఘాతం?
పార్లమెంట్ కన్నా స్థానిక పాలన వ్యవస్థలకు ప్రజాస్వామ్యంలో,రాజ్యాంగ స్ఫూర్తిలో పెద్దన్న పాత్ర..
కానీ ఆ స్ఫూర్తిని BRS సర్కార్ నిలువు పాతర వేయగా..
రాజకీయాల్లో దాయాదిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాత సర్కారు ఒరవడిని కొనసాగించడం విశేషం..
ప్రజా పాలన ట్యాగ్ లైన్ ను అన్ని వేదికలపై అరగిన గ్రామ ఫోన్ రికార్డు వలె వల్లించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు..
తెలంగాణలో మునిసిపల్ పాలక వర్గ సమావేశాలను రహస్యంగా నిర్వహించే చెత్త సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది..
నిజామాబాద్ కార్పొరేషన్ తొలి పాలక వర్గ వసమావేశం పోలీసు పహారాలో జరిగింది. .సమావేశం ప్రధాన ద్వారం మూసేసి..ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు..
కిటికీలు సైతం మూసేసారు..
లోపల జరిగే చర్చలు బయటకు వినబడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..
దర్వాజాలు బందు పెట్టి ప్రజా బిసమస్యలను చర్చించాల్సిన అగత్యం ఎందుకు?
ప్రజా సమస్యలపై చర్చను నేరుగా ప్రజలకు చేరనియ్యకుండా ఉండేందుకు మీడియాను అనుమతించలేదు..
పారదర్శకంగా,పబ్లిక్ ఉన్నది ఉన్నట్లు తేలుసుకునే హక్కును హరిస్తున్నారు..
అయినా ప్రతిపక్షాలు సైతం రహస్య సమావేశాలను వ్యతిరేకించక పోవడం అనుమానాలకు తావిస్తోంది..
ప్రజా సమస్యలపై చర్చను దాచిపెట్టి,,మూసి పెట్టి.. సెన్సార్ చేసిన సమాచారాన్ని బ్రిఫింగ్ పేరిట మీడియా ముందు ఉంచడం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..
అధికార పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం మీడియాను నిషేధించిన బల్దియా మీటింగ్లో దర్జాగా పాల్గొనడం కొసమెరుపు..

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్