Posts

Showing posts with the label telangana education news

ఇందూరు కు రోబోట్ ఇంజనీరింగ్ కోర్సులు

Image
ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో ఉద్దేశ్యంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని...

బాసర త్రిబుల్ IT లో మరో విద్యార్థిని మృతి

Image
నిర్మల్ జిల్లా // బాసర బాసర త్రిబుల్ ఐటీ లో మరో విద్యా కుసుమం నేల రాలిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాలేదని కళాశాల ఆసుపత్రికి వెళ్తే తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి ,సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందించకుండా హైదరాబాదుకు పంపించడం ప్రాణం మీదికి వచ్చింది. బాసర త్రిబుల్ ఐటీ లో PUC సెకండియర్ చదువుతున్న మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన మల్లెపూడి తేజస్విని మృతి చెందింది. మరోవైపు విద్యార్థిని మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పిఆర్ఓ చేత ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు కళాశాల విసి గోవర్ధన్.విద్యార్థిని మృతిని నిరసిస్తూ రాత్రంతా విసి ఆఫీస్ ముందు నిద్రించిన విద్యార్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనితో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చాన్స్ లర్ రాజీనామా చేస్తానని చెప్పడం తో ఒప్పుకోని విద్యార్థులు..? రాజీనామా ముఖ్యం కాదు.. సమస్య లకు పరిష్కారం ముఖ్యమని తేల్చి చెప్పారు విద్యార్థులు.. OSD ని తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.రాత్రి 11 గంటలకు బాసర ఐఐఐటి కి చేరుకొని పరిస్థితి ని సమీక్షించారు ఎస్పీ జానకి షర్మిల.ఉన్నతాధికారులకు పరిస్థితి తెలియజేశారు ఆమె.

నిర్భయంగా పరీక్షలు రాయండి జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి

Image
పరీక్షల్లో విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసి, మంచి ప్రతిభను కనబరచాలని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజన చార్జీలను పెంచి, నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందని, మధ్యాహ్న భోజన నిర్వహకులకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చాకలి లతా శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సాగర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రగోతం రెడ్డి, చిన్న గంగారెడ్డి, పంగా రాజ్యం, ఎల్లం, కీసరి లక్ష్మణ్, కూడెల్లి స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.