ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్
జమాల్పూర్ గణేష్.... ✍︎ తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది. అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక.. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్... స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్.. మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించేందుకు అనేక పాచికలు వేశారు.. ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది.. కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా ...