ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్
- Get link
- X
- Other Apps
జమాల్పూర్ గణేష్.... ✍︎
తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన బల్దియా పోరు టగ్ ఆఫ్ వార్ ను తలపించింది.
అభ్యర్థులు ,పార్టీల బలాబలాలు పక్కకు జరిగిపోయాయి..
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,MP అర్వింద్ ల మధ్య ఆధిపత్య పోరు గా నిలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నిక..
ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.. నరేందర్ రెడ్డి సతీమణిని శమంత ను మేయర్ పీఠం పై కూర్చోపెట్టడానికి మహేష్ గౌడ్...
స్రవంతికి పట్టాభిషేకం చేయడానికి అర్వింద్ పట్టు బిగించి పనిచేశారు.. అంతటితో ఆగలేదు ఈ ఇద్దరి ఫైట్..
మేయర్ అభ్యర్థులను ఓడించేందుకు ఆరో డివిజన్లో మహేష్ గౌడ్,19 వ డివిజన్ లో అర్వింద్ ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించేందుకు అనేక పాచికలు వేశారు..
ఈ రాజకీయ ఆధిపత్య పోరు పోలింగ్ ప్రక్రియను సైతం ప్రభావితం చేసింది.. ఫైనల్గా కాంగ్రెస్,బీజేపీ మధ్య ఓట్ల యుద్ధం సైతం గంభీర్యంగా నిలిచింది..
కమలం పార్టీని,అర్వింద్ కు ముగుతాడు వేసేందుకు మహేష్ గౌడ్ మంత్రాంగం చేసినా ఫలితం కనపడే పరిస్థితి లేదనే అంశం పోలింగ్ ప్రక్రియతో తేటతెల్లమైంది..
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ కమల వికాసం స్పష్టంగా కనబడింది..
అర్వింద్ వల్లించిన మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు MIM, ముస్లింల మీద నూరి పోసిన పలుకులు హిందూత్వ ఓటు బ్యాంకు ఏకీకరణకు దోహదపడింది.. ఇది కమలం అభ్యర్థులకు బూస్టింగ్ ఇచ్చింది.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కుదుపునకు గురైంది..
దీని ఫలితంగానే మళ్ళీ నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలక వర్గంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి సత్తాను నిలుపుకునే పరిస్థితి కనబడుతోంది..20 నుంచి 25 స్థానాలతో అతిపెద్ద సంఖ్యా బలంతో పాటు ఇద్దరు MLA లు,మరో ఇద్దరు MLC లు,MP అర్వింద్ ఓటు తో పాటు ఒకరిద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో కార్పొరేషన్ మీద ముచ్చటగా మూడోసారి కాషాయ జెండా ఎగురవేయడానికి అర్వింద్ పావులు కదుపుతున్నారు..
కమ్మేసేందుకు కాంగ్రెస్ ప్లాన్
సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సరే బల్దియా మేయర్ పదవి అర్వింద్ చేతికి చిక్కకుండా పీసీసీ చీఫ్ మహేష్ మత్రాంగంలో బిజీ బిజీగా ఉన్నారు..
మజ్లీస్,కాంగ్రెస్ సభ్యుల సంఖ్య మేయర్ పీఠాన్ని చేత పట్టడానికి సరిపోకపోతే ఎంత మంది MLC లనైనా పెరేడ్ చేయించి మేయర్ పదవిని చేజార్చుకోకుండా ప్లాన్ వేశారు మహేష్ గౌడ్.
దీని కోసం CM రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం అయ్యారు మహేష్ గౌడ్..
ఎంత మంది MLC లను అయినా ఆప్ట్ చేసుకునే రాజ్యాంగ తోడ్పాటును గత BRS ప్రభుతం తీసుకున్న విధాన పర నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ కు కలసి రాబోతోంది..
BRS మద్దతు కోసం తహతహ
నామినేషన్లు పూర్తి అయ్యి బరిలో దిగిన తరువాత నిజామాబాద్ కార్పొరేషన్ లో BRS గ్రాఫ్ క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది..ప్రచార పర్వం మొదలైనపుడు ఒకటి రెండు సీట్లు వస్తే రావచ్చు అనే పరిస్థితి నుంచి...
ఎన్నికల ఇంచార్జి, మాజీ MLA బిగాల గణేష్ గుప్త వ్యూహాత్మక అడుగులు BRS అభ్యర్థులకు బాలాన్నిచ్చింది..
ఆరేడు డిజన్లలో BRS హోరాహోరీ పోరాడింది.. ఇందులో నాలుగైదు సీట్లలో గెలుపు దిశగా దూసుకు పోయారని పార్టీ అంచనా వేస్తోంది.
ఇదే గనక జరిగితే BRS కీలకం కానుంది. కాంగ్రెస్,బీజేపీ లు సైతం ముందుగా BRS ను పోటీలోనే లేదని తక్కువగా చూశాయి.. పోలింగ్ నాటికి BRS ప్రభావిత శక్తిగా ఎడగడంతో మేయర్ కూర్చిక కిస్సా నేపథ్యంలో వాళ్ళ మద్దతు అవసరం ఉండొచ్చని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్,బీజేపీ సైతం BRS మద్దతు కోసం కూడా ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..
- Get link
- X
- Other Apps