BRS చేతిలో ,ఉద్యమకారులకు అవమానం
మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొవ్వ చూపిన ఇందూరు ఉద్యమ పునాది రాళ్లుగా తళుక్కుమని మెరిసిన ఉద్యమకారులు తెర మరుగు అయ్యారు.. ఉద్యమకారులను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించినా ఇందూర్ గులాబీ నేతలు ఉద్యమ పునాది రాళ్లను సమాధి రాళ్లుగా భావించారు.రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో వారి పేరును సైతం ఉచ్చరించలేదంటే ఉద్యమకారుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.. అది చంద్రబాబు నాయుడి పాలన.. తెలంగాణ ఊసెత్తితేతే తొక్కి నారలు తెసే సమయమది. ఆ నేపథ్యంలో జలదృశ్యం లో TRS పురుడు పోసుకుంది.ఆసభకు హాజరైన AS పోశెట్టి తదనంతరం పదేళ్లు సర్వశక్తులు ఒడ్డి టీఆరెస్ బలోపేతం కోసం పనిచేశారు.. ఆతరువాత అప్పటి కాంగ్రెస్ నేత ఈగ సంజీవ రెడ్డి టీఆరెస్ లో చేరడం పార్టీకి ఊపు ఇచ్చిన సంగతిని విస్మరించారు BRS నేతలు. ప్రధాన స్రవంతి నాయకులు వెనుకడుగు వేసిన తరుణంలో ఈగ సంజీవ రెడ్డి తొలి నాళ్ళలోనే 70 వాహనాల ర్యాలీతో వెళ్లి జల దృశ్యంలో KCR నాయకత్వం లో పార్టీలో చేరారు.భూములు అమ్మి ఉద్యమానికి ఖర్చు పెట్టారు సంజీవ్ రెడ్డి. ఇప్పటికి ఆయన. BRS లోనే ఉన్నారు. పోశెట్టి అప్పటి స్థానిక MLA న...