మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి.
వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి.
సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మంత్రులు స్ట్రీట్ ఫైట్ కు సిద్ధమైన వేళా మహేష్ గౌడ్ మాత్రం కూల్ గా కూకట్ పల్లి నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ..అమ్మవారి సేవలో తరించారు.. ------ ఇది దేనికి సంకేతం? --- BRS ఏలుబడి లో అప్పులపై కార్నర్ చేసేన్దుకు కాంగ్రెస్ ప్రయత్నం ఒక వైపు ప్రయత్నం చేసింది.. సింగరేణి లో రేవంత్ సర్కార్ స్కామ్ లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో టెండర్ల గోల్ మాల్ వ్యవహాలను ఎండకట్టేందుకు BRS ప్రయత్నించింది. ఈ తరునంలో పీసీసీ చీఫ్ ఇన్వాల్ కావడం సహజం.. కానీ దానికి భిన్నంగా గురువారం నాటి పరిణామాలపై మహేష్ మౌన వ్రతం పాటించడం గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
వరంగల్ సభలో భవిష్యత్తు సీఎం బీసీ అవుతారని ప్రకటించిన మహేష్ గౌడ్ పై రేవంత్ రెడ్డి పగ పట్టారు.దాంట్లో భాగమే బిగ్ టీవీ లో వండి వార్చిన తలా తోక లేని ధారా వాహిక ప్రసారాలు.. మొన్నటి 9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదల కార్య క్రమానికి మహేష్ గౌడ్ కు పిలుపు లేక పోవడం వంటి పరిణామాలు PCC చీఫ్ శిబిరంలో నారాజ్ కు కారణం అయ్యాయి.. అందుకే చూద్దాం వాళ్లేమి చేస్తారో అంటూ వేచి చూసే ధోరణిలో మహేష్ గురువారం నాటి పరిణామాలపై పట్టించుకోకుండా మిన్నకుండి పోయారని చర్చ సాగుతోంది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్