Posts

Showing posts with the label Congress vs BRS

ఇద్దరిదీ దొడ్డిదారే.. దాయాదుల దోస్తాన..

Image
రహస్యంగా కార్పొరేషన్ సమావేశం.. ప్రజాస్వామ్యానికి విఘాతం? పార్లమెంట్ కన్నా స్థానిక పాలన వ్యవస్థలకు ప్రజాస్వామ్యంలో,రాజ్యాంగ స్ఫూర్తిలో పెద్దన్న పాత్ర.. కానీ ఆ స్ఫూర్తిని BRS సర్కార్ నిలువు పాతర వేయగా.. రాజకీయాల్లో దాయాదిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పాత సర్కారు ఒరవడిని కొనసాగించడం విశేషం.. ప్రజా పాలన ట్యాగ్ లైన్ ను అన్ని వేదికలపై అరగిన గ్రామ ఫోన్ రికార్డు వలె వల్లించే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.. తెలంగాణలో మునిసిపల్ పాలక వర్గ సమావేశాలను రహస్యంగా నిర్వహించే చెత్త సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి పాలక వర్గ వసమావేశం పోలీసు పహారాలో జరిగింది. .సమావేశం ప్రధాన ద్వారం మూసేసి..ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కిటికీలు సైతం మూసేసారు.. లోపల జరిగే చర్చలు బయటకు వినబడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. దర్వాజాలు బందు పెట్టి ప్రజా బిసమస్యలను చర్చించాల్సిన అగత్యం ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చను నేరుగా ప్రజలకు చేరనియ్యకుండా ఉండేందుకు మీడియాను అనుమతించలేదు.. పారదర్శకంగా,పబ్లిక్ ఉన్నది ఉన్నట్లు తేలుసుకునే హక్కును హరిస...

బీసీ డిక్లరేషన్ అమలు కోసం BRS ఎమ్మెల్యేల నిరసన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Image
📍 హైదరాబాద్: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 👉 కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. 💬 రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. గొల్ల, కురుమల జీవనోపాధిని దెబ్బతీయొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు. 🎣 మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యేలు తెలిపారు. 👉 ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. Follow ...

హరీష్ రావు అడ్డాలో మార్పు జపం

Image
BRS బాహుబలి హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేట గడ్డమీద సీఎం రేవంత్ రెడ్డి మార్పు మంత్రం వల్లించారు. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఒక్కసారి సిద్దిపేట లో సిట్టింగ్ MLA హరీష్ రావు కు బదులు కాంగ్రెస్ ను గెలిపించాలని సిద్దిపేట ఓటర్లను అభ్యర్తించారు. హరీష్ రావు చెబుతున్నట్లు సిద్దిపేట మీద వివక్ష చూపలేదన్నారు సీఎం.10 ఏళ్ల BRS పాలనలో నా కొడంగల్ మీద వివక్ష చూపారని ఎదురు దాడికి దిగారు రేవంత్ రెడ్డి. ప్రసంగం మొత్తం హరీష్ రావు చుట్టే సాగడం విశేషం.. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో 775 కోట్...