బీసీ డిక్లరేషన్ అమలు కోసం BRS ఎమ్మెల్యేల నిరసన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

📍 హైదరాబాద్:
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
👉 కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు.
💬 రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. గొల్ల, కురుమల జీవనోపాధిని దెబ్బతీయొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు.
🎣 మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యేలు తెలిపారు.
👉 ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్