Posts

Showing posts with the label Dharmapuri Sanjay

నిజామాబాద్‌లో సంజయ్ అనుచరుల ఫ్లెక్సీ వార్ – ‘జస్టిస్ ఫర్ DSR’ డిమాండ్

Image
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిస్ ఫర్​ డి ఎస్ ఆర్ ’​ పేరుతో ఫ్లెక్సీలు నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. నిజామాబాద్​ తొలి మేయర్​ ధర్మపురి సంజయ్​కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొన్నటివరకు జరిగిన అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్​తో కలిసి డీఎస్​ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు. నిజామాబాద్​ యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్​ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్​ వద్ద ధర్మపురి సంజయ్​ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్​కుసంజయ్​కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం న...

డీఎస్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టాలి – సంజయ్‌కు పదవి ఇవ్వాలని డిమాండ్

Image
మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్​కు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవి ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో ఆయన అభిమానులు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఒక విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సంజయ్ పాత్ర కూడా ఉందంటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు డిఎస్ మరణం తర్వాత ఆయన సమాధి వద్ద ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవాలన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో సంజయ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర...

అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్ర...