నిజామాబాద్‌లో సంజయ్ అనుచరుల ఫ్లెక్సీ వార్ – ‘జస్టిస్ ఫర్ DSR’ డిమాండ్
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిస్ ఫర్ డి ఎస్ ఆర్ ’ పేరుతో ఫ్లెక్సీలు నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్‌కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొన్నటివరకు జరిగిన అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్‌తో కలిసి డీఎస్ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు.
నిజామాబాద్ యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్ వద్ద ధర్మపురి సంజయ్ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్కుసంజయ్కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. సంజయ్ వ్యవహారం పై కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకొని ఆయనను బుజ్జగించి నామినేటెడ్ పోస్ట్ లాంటివి ఏదైనా కేటాయిస్తారా లేదా ఈ వ్యవహారంలో పిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి కలిసి జిల్లా రాజకీయ పరిణామలపై సంజయ్ తాజా వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel