Posts

Showing posts with the label Hyderabad News

విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి...

Image
విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో...తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. రాళ్లతో కొట్టండి:- తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత తెలిపారు. అ...

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Image
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ గారు నంది నగర్ లోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. కాంగ...

శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం

Image
హైదరాబాద్: శాసన మండలి సభ్యునిగా ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోదండరాం గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టి.జే.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. శాసన మండలి మీడియా పాయింట్ లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్తా” అని స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను...

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

బీసీ డిక్లరేషన్ అమలు కోసం BRS ఎమ్మెల్యేల నిరసన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Image
📍 హైదరాబాద్: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 👉 కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. 💬 రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. గొల్ల, కురుమల జీవనోపాధిని దెబ్బతీయొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు. 🎣 మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యేలు తెలిపారు. 👉 ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. Follow ...

జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్

Image
హైదరాబాద్, జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅఃడ్ పీఆర్) కమీషనర్ కార్యాలయం(సమాచార భవన్) ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల"ఛలో హైదరాబాద్"కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఅండ్ పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ల...