శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్: శాసన మండలి సభ్యునిగా ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోదండరాం గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టి.జే.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
శాసన మండలి మీడియా పాయింట్ లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్తా” అని స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు.
వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎమ్మెల్సీ పదవి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతానని తెలిపారు. గతంలో ఉన్న జీవనశైలిని భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తానని, ప్రజల కోసం ఎప్పుడూ నిలబడతానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్