Posts

Showing posts with the label Ila Tripathi

పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి-కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

Image
నిజామాబాద్, పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంతో గ్రామసభకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల...

కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
నిజామాబాద్, నేత్ర సమస్యలను అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆకు కూరలు, క్యారెట్ వంటి వాటిని ఆహార పదార్థాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని కలెక్టర్ వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్...

గీత దాటితే వేటు తప్పదు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

Image
నిజామాబాద్, మార్చి 23 : విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ పైవిధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండీగా తేల్చి చెప్పారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు ...