పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి-కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు
నిజామాబాద్,
పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంతో గ్రామసభకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు.
ప్రభుత్వం రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, చేయూత పథకం కింద పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందని అన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తేవాలని సూచించారు. అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే, ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా తొలివిడత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు తుది దశకు చేరాయని, త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనుందని అన్నారు. గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గుడిసెలలో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, అంగన్వాడీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుందని వివరించారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel