ఐ డి ఓ సి ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు
నిజామాబాద్,
ఈరోజు ఐడిఓసి ఉద్యోగులకు జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల రెండు రోజుల ఆరోగ్య శిబిరాలను కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాటి ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐడి ఓసి లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను ఆరవ తేదీ,ఏడవ తేదీ రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.అందరు తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి తన జీవన శైలిలో మార్పులను చేసుకుంటూ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యం పై హెల్త్ వీక్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు ఆరోగ్య భద్రతపై అవగాహన దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.దీనికోసం చక్కని పోషకాహారం, సిరి ధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అన్నారు
.ఈ సందర్భంగా ఉద్యోగుల కోసం సిరి ధాన్యాలు, గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహించారు. ఇంకా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించడమే కాకుండా మొబైల్ హ్యాండిల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ ఈరోజు నాలుగు వైద్య బృందాల చేత ఉద్యోగుల కోసం జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను 206 మంది ఉద్యోగులకు నిర్వహించడం జరిగిందని, ఇందులో పురుషులు 121 మంది,మహిళలు 85 మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఈరోజు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా హైపర్ టెన్షన్ 11 మందిలో గుర్తించడం జరిగిందని, మధుమేహాన్ని 8 మందిలో గుర్తించడం జరిగిందని, వీరిలో ఇద్దరిని ఉన్నత వైద్య సేవల కోసం రిఫర్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా క్షయ వ్యాధి నిర్ధారణలో భాగంగా 101 మంది ఉద్యోగులకు ఎక్స్రే తీయడమే కాకుండా వారిలో నలుగురిని కొత్తగా క్షయ వ్యాధి బాధితులుగా గుర్తించడం జరిగిందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి, ప్రోగ్రాం అధికారి ఎన్సీడీ డాక్టర్ వెంకన్న, డీఎస్ఓ డాక్టర్ వెంకటేష్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అశ్విని, వైద్యులు డాక్టర్ సంజీవరెడ్డి, డాక్టరు భాస్కర్, డాక్టర్ అజ్మల్ ,డాక్టర్ కావ్య, డాక్టర్ సుసేన, డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శిఖరా,డాక్టర్ అవంతి, డిపిఓ విశాల, డి పి సి వెంకటేశం, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, టీబీ కోఆర్డినేటర్స్ రవి గౌడ్, లక్ష్మణ్ ,నరేష్,ఎం ఎల్ హెచ్ పి లు, పర్యవేక్షణ అధికారులు ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel