Posts

Showing posts with the label Kamareddy

తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం

Image
 కామారెడ్డి, రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ వారు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ మరియు ఇతర సామగ్రిని విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఈ సహాయం అందింది. ఈ సందర్భంగా గ్రూప్ మేనేజ్‌మెంట్ తరఫున జీఎం సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్‌లు, 5 క్లాస్‌రూమ్ టేబుల్స్, ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరోక్స్ సదుపాయంతో), ఒక ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్, 10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి, మేనేజర్లు ఒబ్లేష్, శివకుమార్, శ్రీనివాస్‌లకు గ్రామస్థుల తరఫున, పాఠశాలల తరఫున సన్మానం చేసారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణాల లక్ష్మి జగదీష్, ఉపసర్పంచ్ నర్మల వెంకట్, మండల విద్యాధికారి పూర్ణచందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండల విద్యాధికారి మధ్య...

కామారెడ్డికి ఔటర్ రింగ్ రోడ్డు

Image
కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కలిసి విన్నవించారు కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కలసి స్థల పరిశీలన, వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసారు. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి, నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు ఈ సందర్భంగా రమణ రెడ్డి తెలిపారు.

షబ్బీర్ భాయ్ కళ్ళు చెమ్మగిల్లిన వేళా...

Image
కామారెడ్డి, ముగ్గురు చిన్నారుల హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురైనారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. కామారెడ్డి పట్టణంలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. కన్నతండ్రే కాలయముడై అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు షిఫత్, ఆయాత్, మరియం లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఈ అమానుష ఘటన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని తీవ్రంగా కలిచివేసింది. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే షబ్బీర్ అలీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన ముగ్గురు బిడ్డలను కోల్పోయి విలపిస్తున్న తల్లిని చూసి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పే సమయంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడు? కన్నబిడ్డలను చంపుకోవడానికి మనసెలా ఒప్పింది? ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, మానవత్వానికే తలవంపులు అని ఆవేదన వ్యక్తం చేశారు.  మన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే ,ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనకు తోచినంత సహాయం చేస్తే ఇలాంట...

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.