ఏనుగు దంతాలు ఊడినయ్.. శ్రేణులు ఆగం అయ్యినయ్

(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) 

 ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వెలిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గంజిలో పడ్డ ఈగ చందంగా మారింది. "ఏనుగు దంతాలు ఊడినయ్-శ్రేణులు అయోమయంలో పడినయ్" అంటూ రాజకీయ ప్రత్యర్ధులు రాగాలు తీస్తున్నారు.. ఈ విచిత్ర అరుదైన రాజకీయ పరిస్థితులపై మన నిజామాబాద్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇది.. ఏనుగు రవీందర్ రెడ్డి TRS రాజకీయ ప్రస్థానంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి సీనియర్ MLA గా తిరుగు లేని ఆధిపత్యం చెలాయించారు..ఆ ఊపుతోనే ఈటెల రాజేందర్ తో బీజేపీలో చేరి హల్చల్ చేశారు.. అక్కడ వర్కవుట్ కాక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బాన్సువాడ బాద్షా కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి BRS సిట్టింగ్ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు చూపించారు.. తానోడినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పోచారం కు చెక్ పెట్టారు.. బాన్సువాడ సెగ్మెంట్ లో ఇసుక పోయింట్స్ కంట్రోల్ లోకి తెచ్చుకుని కల్లం లో కుప్పలుగా ఎగబోసుకున్నారు.. పోలీస్, రెవెన్యూ తో పాటు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊపిరి ఆడనీయలేదు ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈ పరిస్థితి తట్టుకోవడం కష్టమని భావించిన పోచారం రేవంత్ రెడ్డితో జతకట్టి కారుకు హాండ్ ఇచ్చారు.. దీనితో సీన్ రివర్స్ అయింది. రవీందర్ రెడ్డిని కార్నర్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఆధిపత్యం చెల్లుబాటు కాకుండా పోచారం పావులు కదపడంలో సక్సెస్ అయ్యారు. అది ఎంత వరకు పోయిందంటే ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వం ,అటు ప్రభుత్వ పెద్దలు రవీందర్ రెడ్డిని పట్టించుకోవడం మానేశారు.సెగ్మెంట్లో పార్టీకి ఇంచార్జి అయినా రవీందర్ రెడ్డి అనుచరుల్లో ఒక్కరికి కూడా కౌన్సిలర్ టికెట్ రాకుండా అడ్డుకున్నారు పోచారం.. అదే పక్కనే ఉన్న కామారెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబ్బీర్ అలీని కాదని కొత్త తరం నేత చంద్ర శేఖర్ రెడ్డి వర్గానికి 10 కౌన్సిలర్ టికెట్స్ ఇచ్చారు.కామారెడ్డి లో పార్టీ కట్టుబాట్లను ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ నిలువు పాతర వేసి షబ్బీర్ అలీని వ్యతిరేకిస్తున్న "గడ్డం" గ్యాంగ్ కు టికెట్స్ కట్టబెట్టిన తీరుపై కుమిలి పోయారు "ఏనుగు". బాన్సువాడ పార్టీకి ఇంచార్జి అయినా ఖాతరు చేయని అధిష్టానం వైఖరి కోలుకోలేని డ్యామేజ్ చేసింది.. ఈ పరిస్థితులు రవీందర్ రెడ్డిని కుంగదీస్తున్నాయి.. 

 మద్ధతు దారులు ఆగం ....... 

స్థానిక సంస్థలు ZPTC, MPTC ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పోచారం ఆధిపత్యం చెల్లుబాటు అవుతుండగా రవీందర్ రెడ్డి గుంపులో ఉంటే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ఆగం అవుతున్నారు. రాజకీయ ఉనికికే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నారు వారు.. దీనికి తోడు గత కొంత కాలంగా అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలకు రవీందర్ రెడ్డి దూరం కావడంతో క్యాడర్ మరింత నిరాశలో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో మొన్నీ మధ్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు రవీందర్ రెడ్డి.. ఆత్మీయ సమ్మేళనం పేరిట సభ పెట్టి బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా క్యాడర్ లో మాత్రం భరోసా రావడం లేదని ప్రచారం జరుగుతోంది.. మొత్తానికి ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భవితవ్యం ఏంటనేది వెయ్యి డాలర్ల ప్రశ్న గా ఉంది.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్