Posts

Showing posts with the label Kavitha

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఖబర్దార్: కవితపై బీజేపీ నేత దాంపల్లి జ్యోతి ఫైర్

Image
నిజామాబాద్, కల్వకుంట్ల కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. లిక్కర్ కేసులో కోట్లు సంపాదించిన మీరు కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఎందరో యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో మీ డాడీ సగం తెలంగాణను నాశనం చేస్తే మీరు కొత్త పార్టీ అంటూ మిగిలిన సగాన్ని నాశనం చేసేందుకు వస్తున్నారని ఆమె ఆక్షేపించారు. మీ సొంత ఇంట్లోనే మీకు చక్కగా లేదని అలాంటిది రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని , కొత్త పార్టీ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని దాంపల్లి జ్యోతి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కొత్త పార్టీ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని జ్యోతి దుయ్యబట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు పేల్చడం సిగ్గుచేటు అన్నారు. ...

మానవత్వం మంట కలిసిన వేళా.. - పంచరెడ్డి కుటుంబానికి పలకరింపేది?

Image
వారిద్దరూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మరొకరు కార్పొరేటర్ పంచర్ రెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పటి పరిస్థితి... గతంలోకి ఒకసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పుకోసం ప్రయత్నించేవారు ఇది గతం.... అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో... కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచర్ రెడ్డి సురేష్ సతీమణి అనిత, పార్టీ బిజెపి కల్వకుంట్ల కవిత కు బద్ధ శత్రువు అయిన పార్టీ.. అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీలో చేరారు పంచర్ రెడ్డి సురేష్ అనిత, ఆ తర్వాత ఆమె కార్పొరేటర్ గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోని ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచ రెడ్డి సురేష్ గుండెపోటుతో మరనించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అ...