మానవత్వం మంట కలిసిన వేళా.. - పంచరెడ్డి కుటుంబానికి పలకరింపేది?

వారిద్దరూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మరొకరు కార్పొరేటర్ పంచర్ రెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పటి పరిస్థితి... గతంలోకి ఒకసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పుకోసం ప్రయత్నించేవారు ఇది గతం....
అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో... కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచర్ రెడ్డి సురేష్ సతీమణి అనిత, పార్టీ బిజెపి కల్వకుంట్ల కవిత కు బద్ధ శత్రువు అయిన పార్టీ.. అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీలో చేరారు పంచర్ రెడ్డి సురేష్ అనిత, ఆ తర్వాత ఆమె కార్పొరేటర్ గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోని ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచ రెడ్డి సురేష్ గుండెపోటుతో మరనించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అయితే ఇక్కడే అసలు బాధ .... మొన్నటివరకు బీఆర్ఎస్ లో ఉన్న సురేష్ బీజేపీ నుండి ఆమె భార్యకు టికెట్ రావడం.. గెలుపొందడం అంతా చక చక గడిచిపోయాయి. ఆ తర్వాత ఆ కుటుంబంలో తీవ్ర సంతోషం ఏర్పడింది. ఇదంతా ఒకే ఎత్తు.. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ..మాట్లాడక తప్పని పరిస్థితి.
ఇక ఆడవారి కష్టాలు బాధలు మరో ఆడవారికి తెలుసు అని నిరూపించింది టిఆర్ఎస్ నుండి నిష్క్రమించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత .మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సురేష్ మరణించిన వార్త తెలియగానే శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆమెకు శ్రీరామనవమి సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు నిజామాబాద్ కు వచ్చారు. అయితే అంతకు ముందు రాత్రి గురువారం రాత్రి నిజాంబాద్ కు ఆమె చేరుకున్న ఆమె హుటా హుటిన సురేష్ ఇంటికి వెళ్లి వారి సతీమణి కార్పొరేటర్ ను అనదగ్గరకు తీసుకుని ఓదార్చారు. అంతేగాక సురేష్ పిల్లలకు వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు కవిత. కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఓదార్చడానికి పార్టీలో, రాజకీయాల్లో ముఖ్యం కాదని నిరూపించింది మనసున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.
ప్రీతం రెడ్డి నిజామాబాద్ అర్బన్ ( మన నిజామాబాద్)

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్