ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఖబర్దార్: కవితపై బీజేపీ నేత దాంపల్లి జ్యోతి ఫైర్

నిజామాబాద్,
కల్వకుంట్ల కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. లిక్కర్ కేసులో కోట్లు సంపాదించిన మీరు కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఎందరో యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో మీ డాడీ సగం తెలంగాణను నాశనం చేస్తే మీరు కొత్త పార్టీ అంటూ మిగిలిన సగాన్ని నాశనం చేసేందుకు వస్తున్నారని ఆమె ఆక్షేపించారు. మీ సొంత ఇంట్లోనే మీకు చక్కగా లేదని అలాంటిది రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని , కొత్త పార్టీ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని దాంపల్లి జ్యోతి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కొత్త పార్టీ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని జ్యోతి దుయ్యబట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు పేల్చడం సిగ్గుచేటు అన్నారు. మరోసారి ఎంపీ అరవింద్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీలను పూర్తి చేసేందుకు ఎంపీ అరవింద్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు ప్రజలకు ఏం చేశారని కొత్త పార్టీ పెడుతున్నారని, కోట్లు గడించిన కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే కవితకు సరిగ్గా సరిపోతుందని దాంపల్లి జ్యోతి ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ మహిళా కార్పొరేటర్ లు కరిపే కరిపే అర్చనా చిరంజీవి, చింత ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి, దాత్రిక రేవతి పరమేశ్వర్, ఇప్పకాయల సుమిత్ర దేవి తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్