Posts

Showing posts with the label Mohan Bhagwat

హిందువుల ఐక్యత కోసమే ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన : కందకుర్తిలో మోహన్ భగవత్

Image
దేశంలో ఉన్న హిందువులను ఐక్యం చేయడానికే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రెంజల్ మండలంలోని మండలంలోని కందకుర్తి లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్పూర్లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని సంకల్పించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు ఓ డాక్యుమెంటరీ వీడియో ద్వారా పూర్తిగా తెలిసిందన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి.. గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్ భగవత్ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు ...

కందకుర్తికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Image
నిజామాబాద్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. మ...

🟠 నిజామాబాద్ నేలపై RSS బీజం

Image
డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ వందేళ్ల క్రితం కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వవ్యాప్తమైంది. ఈ మహా యజ్ఞానికి బీజం పడింది నిజామాబాద్ జిల్లాలో కావడం విశేషం. ఐదుగురితో ఏర్పడ్డ RSS అంచెలంచెలుగా దేశవ్యాప్తం లక్షల స్వయం సేవకులను తయారు చేసింది. ప్రపంచంలోని ముఖ్య దేశాలలో సైతం RSS భావజాలం విస్తరించింది. RSS సిద్ధాంతం నచ్చి.. ఆ భావజాలం నీడలో హెగ్డేవార్ హిందుత్వ ఎజెండా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. బలమైన రాజకీయ శక్తిగా ఇండియాలో చోదక శక్తిగా ఎదిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు గడ్డ మీద పురుడు పోసుకుంది. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో RSS పుట్టింది. RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ తాతయ్య నరసింహ శాస్త్రి. వారి వంశం రేవతి బాయి, బలిరం అనే దంపతులకు జన్మించిన మహానుభావుడు , గొప్ప వ్యక్తి హెడ్గేవర్ .ఆయన జన్మించింది మామూలు రోజు కాదు ..ఆయన పుట్టింది పెరిగింది హిందువుల తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది రోజున..హెగ్డేవార్ 1889 లో జన్మించినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కందకుర్తి గ్రామంలో 30 కోట్ల రూపాయలతో మూడు అంతస్తులతో కూడిన ఎడ్గేవర్ స్మృతి భవనాన్ని నిర్మిస్తున్నారు అ...