🟠 నిజామాబాద్ నేలపై RSS బీజం
డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ వందేళ్ల క్రితం కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వవ్యాప్తమైంది. ఈ మహా యజ్ఞానికి బీజం పడింది నిజామాబాద్ జిల్లాలో కావడం విశేషం. ఐదుగురితో ఏర్పడ్డ RSS అంచెలంచెలుగా దేశవ్యాప్తం లక్షల స్వయం సేవకులను తయారు చేసింది. ప్రపంచంలోని ముఖ్య దేశాలలో సైతం RSS భావజాలం విస్తరించింది. RSS సిద్ధాంతం నచ్చి.. ఆ భావజాలం నీడలో హెగ్డేవార్ హిందుత్వ ఎజెండా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. బలమైన రాజకీయ శక్తిగా ఇండియాలో చోదక శక్తిగా ఎదిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు గడ్డ మీద పురుడు పోసుకుంది. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో RSS పుట్టింది. RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ తాతయ్య నరసింహ శాస్త్రి. వారి వంశం రేవతి బాయి, బలిరం అనే దంపతులకు జన్మించిన మహానుభావుడు , గొప్ప వ్యక్తి హెడ్గేవర్ .ఆయన జన్మించింది మామూలు రోజు కాదు ..ఆయన పుట్టింది పెరిగింది హిందువుల తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది రోజున..హెగ్డేవార్ 1889 లో జన్మించినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కందకుర్తి గ్రామంలో 30 కోట్ల రూపాయలతో మూడు అంతస్తులతో కూడిన ఎడ్గేవర్ స్మృతి భవనాన్ని నిర్మిస్తున్నారు అది కాస్త తుది దశకు చేరుకుంది. అయితే ఏప్రిల్ 11న ఈ దివ్య మందిరాన్ని జాతికి అంకితం చేయడానికి బాద్యులు నిమగ్నమయ్యారు. ఆరోజునే ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక అంతకుముందు మార్చి 27న స్ఫూర్తి మందిర గృహ ప్రవేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా 1925న విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు. అయితే స్వయం సేవలు కేవలం మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఇంటిని సంఘ సేవకులు 1993లో స్మృతి మందిరంగా మార్చారు. రాబోయే నెల 11న జరిగే సిద్ద జయంతి ఉత్సవాలకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్ రానున్నారు. ఆయనతోపాటు బిజెపి కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు బిజెపి పార్టీ శ్రేణుల నుండి తెలుస్తుంది. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కందకుర్తి గ్రామానికి చెందిన ఓ వేద పండితుడు మన నిజామాబాద్ తో మాట్లాడుతూ తమ ఊర్లో ప్రపంచంలోనే జరుపుకునే అతిపెద్ద పండగ రాబోతుందని సంతోషం వ్యక్తంచేశారు.. తమ ఊర్లో మైనార్టీలు అధికంగా ఉన్నప్పటికీ వారితో ఏ గొడవ పెట్టుకోకుండా అందరం ఐక్యమత్యంతో కలిసి మెలిసి అన్నదమ్ముల్ల కలిసుంటామని ఆయన పేర్కొన్నారు.

Follow Our WhatsApp Channel