Posts

Showing posts with the label Political News Telangana

KTR, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,BJP MLA పాయల్ శంకర్ భేటీ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.

Image
అసెంబ్లీ వేదికగా ఇద్దరు బడా నేతలు లంచ్ టైమ్ టేబుల్ మీటింగ్లో భేటీ కావడం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.. ఉత్తర,దక్షిణ దృవాలుగా ఉన్న BRS, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు పెద్ద నాయకుల భేటీలో జాతీయ పార్టీ MLA కూడా ఉండడం పెను సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాన్నం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కాంగ్రెస్ రెబల్ స్టార్, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య అసెంబ్లీ లాంజిలో విందు సమావేశం జరిగింది. వీరితో పాటు BJP MLA పాయల్ శంకర్ కూడా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ముచ్చటగా మూడు ప్రధాన పార్టీల ప్రజా ప్రతినిధుల నడుమ జరిగిన భేటీ పావు గంటనో.. అర్ధ గంటనో అయితే మామూలు భేటీ అనుకోవచ్చు.. ఏకంగా రెండు గంటల పాటు ముగ్గురు నేతల మధ్య రాజకీయ చర్చ జరిగింది. సాయంత్రం వరకు ఈ ముగ్గురు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. దీనితో అసలేమి జరిగిందనే అంశంపై నిఘా వర్గాలు రంగంలో దిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఢిల్లీ వెళ్లడం..ఇదే అదనుగా KTR, రాజగోపాల్ రెడ్డి,పాయల్ శంకర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది.. మంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ ముందే హామీ లభించడంతో ర...

ఆదానీకి అమ్మేసి సుద్దపూస మాటలా?

Image
ఎంపీ అరవింద్‌పై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి విమర్శలు Nizamabad: జిల్లాకు గత పది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి సాధించారో చెప్పకుండా ఈనెల 21న “చలో కలెక్టరేట్” కార్యక్రమం చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఎంపీ Dharmapuri Arvind పై విమర్శలు గుప్పించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్‌కు జిల్లా అభివృద్ధిపై, ముఖ్యంగా రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నా, పసుపు రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని, మార్కెట్ యార్డుల్లో రైతులు ధర పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎంపీ స్పందించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు రైతుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన అరవింద్ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ప్రశ్నించారు. జిల్లాలో ఎప్పుడూ రాజకీయ...

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

Image
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..