Posts

Showing posts with the label Telangana Congress

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Image
* కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ * ........... టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, మహిళలు సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

Image
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...

తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది..? ప్రజలేమనుకుంటున్నారు..?

Image
*ప్రజలేమనుకుంటున్నారు..?* ......... (కొండల్ ,సీనియర్ జర్నలిస్టు) డేంజర్ బెల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదా..? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో “లోకమంతా పచ్చగా” ఉందా..? ఇది వందిమాగధుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా అంతకంటే కాదు. కానీ జనబాహుళ్యం ప్రతిస్పందన కూడా ఒకసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్లు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించానని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్ కు పదేళ్ల తరువాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ...

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

Image
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..