తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది..? ప్రజలేమనుకుంటున్నారు..?
*ప్రజలేమనుకుంటున్నారు..?*
.........
(కొండల్ ,సీనియర్ జర్నలిస్టు)
డేంజర్ బెల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదా..? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో “లోకమంతా పచ్చగా” ఉందా..? ఇది వందిమాగధుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా అంతకంటే కాదు. కానీ జనబాహుళ్యం ప్రతిస్పందన కూడా ఒకసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్లు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించానని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్ కు పదేళ్ల తరువాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ఇప్పుడు ప్రజానీకం భావిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా అనుకుంటున్నట్లే తెలంగాణలోనూ ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్ర నిర్మాతలు అధికారంలోకి రావాలని ఆకాంక్షతో హామీల వర్షం గుప్పించిన పార్టీ పనితీరును సదా పరిశీలిస్తారు. వాళ్ల పరిశీలన ఐదేళ్ల తరువాత గానీ ఈ పార్టీలకు అర్థం కాదు. ఐదేళ్లనాడు ఎన్నికల్లో ధన ప్రభావంతో తాము మళ్లీ అధికారం అందుకోవచ్చని భావించే నాయకులకు, ఆ ప్రజలే తగు రీతిలో సమాధానం ఇచ్చిన సంస్కృతి ఇక్కడిది. ఆరు గ్యారెంటీల అమలు ప్రధానంగా ఉన్న అనేక అంశాలను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న తీరుపట్ల రాజధాని నగరంలో అధికార యంత్రాంగం చుట్టూ తిరిగే విశ్లేషకుల అభిప్రాయానికి భిన్నంగా గ్రౌండ్ రియాలిటీ ఉన్నది. నిజానికి ప్రభుత్వం , అధికార పార్టీ కొంత మంది ప్రజాప్రతినిధులు, వాళ్లకు మద్దతిస్తున్న నాయకులు అభిప్రాయపడుతున్నట్లు ముఖ్యమంత్రి పనితీరుపట్ల ప్రజల్లో రోజీ పిక్ఛర్ లేదు. అధికారంపై ఆశించిన తరహాలో పట్టుకూడా ముఖ్యమంత్రికి లేదనే స్పష్టమైన అభిప్రాయం బహుళ ప్రజానీకంలో ఉంది. దీన్ని కోటరీలో భాగస్వాములైన నాయకులు, వందిమాగధుల రూపంలో బ్రహ్మాండంగా ఉందని చెబితే అది ప్రస్తుతానికి నమ్మకపోవడం మంచిదేమో.. ఆరు గ్యారెంటీల అమలు మాత్రమే ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అని నాయకులు భావించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఒక రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధన ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నాయకుల బాధ్యతగా ఉంటుందని వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి రావడం ఇబ్బందికరంగా అనిపిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక స్థితి దివాళా తీసిందని, ఆ కారణంగా ఆశించిన అభివృద్ధి సాధించలేకపోతున్నామని చెప్పుకోవడాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదు. సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పాటు ఆరంభ దశలోనే రైతుల కోసం నిర్దేశించిన రైతు బంధు పథకం అమలులో వస్తున్న అవాంతరాలు, అమలు పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది లేమి రైతాంగాన్ని ప్రస్తుత అధికార పార్టీకి దూరం చేస్తున్నది. రైతు రుణమాఫీ పేరిట జరిగిన మాఫీ మంత్రాంగం ప్రచారం చేసుకోవడంలో అధికార పక్షం విఫలమైంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, కాంగ్రెస్ పార్టీని రాష్ర్టంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించడమే కాక తెలంగాణకు మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఆపార్టీలో కొనసాగుతారా అనే విషయంపై చర్చ జరగడం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీకి సవాల్ గా పరిణమించే ప్రధాన అంశంగా నిలుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉంటున్నాయనే మిషతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అతి చేరువగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడనే విమర్శలు రావడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నది. కొన్ని ప్రత్యేక సందర్భాలను కూడా ఈ విషయంలో ప్రస్తుతిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ మనుగడకు ఇది ఒక అవరోధంగా నిలవవచ్చని పల్లెల్లో భావిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇతర రాష్ట్రాల వలె సమాంతర నాయకత్వం ఎదుగుదల కోసం ప్రయత్నం లేకపోవడం కూడా ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నది.i ఓ కేంద్రమంత్రి కొడుకు వివాదాస్పద కేసులో నిందితుడుగా ఉన్న కేసు విషయమై ప్రభుత్వ తాత్సార వైఖరి చర్చనీయాంశంగా మారటం ప్రజల్లో అధికార పార్టీకి ఇబ్బందిని కలిగిస్తున్నది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి భిన్న పక్షాల వాళ్లైనప్పుడు వాళ్లమధ్య కొట్లాట దోరణులు ఉండాలని చెప్పలేం గానీ, జనం దృష్టిలో పడేంత అన్ ఈజీ ఫ్రెండ్ షిప్ ఉండడం దీర్ఘకాలంలో అధికార కాంగ్రెస్ కు నష్టం చేసేదిలా ఉంది. అవును.. చిన్న గీత చిన్నగా కనిపించాలంటే పక్కన పెద్ద గీత రావలసిందే. తెలంగాణలో ఆ గీత గీయగలిగే సామర్థ్యం ఇప్పటికిప్పుడు బీజేపీకి లేదు. కానీ రాజకీయ సమీకరణాల అనూహ్యమలుపులు ఇందుకు దోహదపడుతుండవచ్చనే చర్చ జరుగుతున్నది. ఆ మధ్య సోషల్ మీడియా లో వెలువరించిన అభిప్రాయం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని ఓ మిత్రుడు అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు కూడా ప్రజల ఆందోళన నేపథ్యంలో కేంద్రంలోని అధికార పక్ష విస్తరణను తెలంగాణలో జన బాహుళ్యం నిరోధించాలనే ఆకాంక్షతోనే ఈ ఆవేదన.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel