PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎
తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు.
20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం.
తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా పెయిల్ అయ్యారని బద్నాం చేసే పంచ రంగుల 'బిగ్' కుట్ర స్క్రీన్ మీదకొచ్చి పైశాచిక ఆనందం పొందుతోంది..
ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచే టీవీ లో వరుస విషపు ప్రచార బులెటిన్స్ మీద మహేష్ గౌడ్ కు అనుకూలంగా ఒక్క గొంతు కూడా లేవలేదు.. సీఎం నజర్ లో పడడం ఎందుకని బీసీ నేతలు కూడా మౌన వ్రతం పాటిస్తున్నారు..
.... ఇందూర్ నేతలను ఎగదోస్తున్నారు..
... మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలను హైదరాబాద్ పెద్దలు ఎగదోస్తున్నారు. సొంత జిల్లాలో నే మహేష్ గౌడ్ కు పొగబెట్టే కుట్రకు తెర లేచింది.. వరుస కథనాలు ప్రసారం అవుతున్న సమయంలోనే నిజామాబాద్ నేతలకు హైదరాబాద్ షాడోల నుంచి ఫోన్ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. సొంత జిల్లాలోనే మహేష్ గౌడ్ విఫల నేతగా డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోంది.
అవసరమైతే ఢిల్లీ పెద్దలకు ఇందూర్ అసమ్మతి గళం పేరిట వినిపించే ప్రణాళిక రెడీ అయ్యింది. మొదటి నుంచి మహేష్ గౌడ్ తో పోసగని నేతలను అప్రోచ్ అయ్యారు హైదరాబాద్ షాడో మ్యానేజ్ మనుషులు..
వీళ్ళు సిద్ధం చేసిన నేతల్లో నియోజకవర్గ స్థాయి నేతలే ఎక్కువ ఉండడం గమనార్హం..
మొత్తానికి మహేష్ గౌడ్ కుర్చీ కి ఎసరు పెట్టే 'బిగ్' కుట్ర మీద ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel