Posts

Showing posts with the label brs party

గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR

Image
గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం --ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR ........ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర...

ఘనంగా గణేష్ గుప్త జన్మదిన వేడుకలు

Image
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నగర BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ బిగాల జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రయాణికులకు మరియు స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇంచార్జులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజ...

అన్నా నన్ను దేవుడే పంపిండు.. -జీవన్ రెడ్డి భావోద్వేగం

Image
ఎర్రవల్లి, కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే...

కేసీఆర్ కార్యాలయంపై దాడికి మూల్యం తప్పదు

Image
నిజామాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల భౌతిక దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సారతి, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయం అని తెలిసి కుట్రపూరితంగా మూకుమ్మదిగా దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వసం చేయడం క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు.భారాస నాయకులపైన కుట్రలు చేస్తూ దాడులు చేయడం కాంగ్రెస్ విషసంస్కృతిలో బాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులు భారాసకు ఉన్నాయని, భారాస శ్రేణుల బలం ముందు కాంగ్రెస్ పలాయనం కాకతప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్ తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జెకట్టి కదిలిన చరిత్ర ఉన్నదని మరొకసారి గజ్జెకట్టి కదిలితే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులను , కాంగ్రెస్ ను అంధపాతాలానికి తొక్కివేసె బలం గజ్వేల్ ప్రజల సొంతమని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కొలమాణంగా భారాస కదిలి కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందని...

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

Image
📍 నిజామాబాద్, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel