హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

📍 నిజామాబాద్,
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది.
అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు.

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్