గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR
గల్ఫ్ కార్మికుల ఓట్లు
తొలగిస్తే ఊరుకోం
--ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR
........
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు.
ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు.
శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ విషయంలో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు, దీంతోపాటు స్థానికంగా కూడా పార్టీ తరఫున ఎస్ఐఆర్ (SIR) కోసం నియమించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు.
తమకు కేటాయించిన బూత్ల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. దీంతోపాటు పార్టీ తరఫున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈరోజు జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ నేతలకు వివరించారు.
పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్ను గెలుచుకొని భారత రాష్ట్ర సమితికి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు.
నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు.
కేసీఆర్ సూచించినట్లు సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలని సూచించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలంతా తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులపైన కేటీఆర్‌కి వివరాలు అందజేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వీప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని నేతలు తెలిపారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇


Click here to 👆 Follow Our WhatsApp Channel