వంటపనిలోనూ తగ్గేదేలే.. -- కులాంతర ప్రేమ పెళ్లి -- మేయర్ ఉమ తండ్రి ప్రముఖ జర్నలిస్టు
(జమాల్పూర్ గణేష్, ప్రీతం రెడ్డి) ఆమె నగర ప్రథమ పౌరురాలు.తెలంగాణలోనే అతిపెద్ద మూడవ మునిపల్ కొర్పొరేషన్ మేయర్గా ప్రమాణం చేశారు.ఆరోజు అంతా బిజీ బిజీగా గడిపారు.నిజామాబాద్ లో బుటిక్ నడుపుకునే అతి సాధారణ సగటు మహిళ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వల్ల ఊహించని ప్రోటోకాల్ పోస్టు సొంతమైంది కూడగాయల ఉమారాణికి..దీనితో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితర ఉద్దండులతో మర్యాద పూర్వక భేటీలు..కాంగ్రెస్ శ్రేణులతో సంబరాల్లో గడిచి పోయింది.మరుసటిరోజు యధావిధిగా ఇంటి పనులు,వంట పనుల్లో నిమగ్నం అయ్యారు నగర ప్రధమ పౌరురాలు..అదే సమయానికి మన నిజామాబాద్ వీడియో జార్నలిస్టు పొద్దుటూరు ప్రీతం రెడ్డి మేయర్ ఇంటి పనుల్లో బిజీ అయిన తీరును చిత్రీకరించారు.. గ్యాస్ స్టవ్ వెలిగించి పప్పుచారు కాస్తూనే.. మరో సైడ్ చాయ్ చేశారు..నడుమ కిచెన్ సర్దడం.పోపు డబ్బాలు,మసాలా దినుసులు క్రమంగా సర్దుకుని ఇల్లాలుగా భాద్యతలు పూర్తి చేసుకున్నరూ. మేయర్ కిచెన్ నుంచి హాల్ లో కొద్ది సేపు టీవీ చూసారు.ఆతరువాత భర్త కరాటే రమేష్ తో కలిసి బంధు మిత్రులతో కలిశారు మేయర్ ఉమారాణి. స్నేహితులు,హితులు వారిద...