Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

జమాల్పూర్ గణేష్...✍️
 ఎంపీ అర్వింద్ ఏది మాట్లాడినా ట్రిండింగే..మౌనంగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులకు తొండను మింగిన అనుమానమే అంటే అతిశయోక్తి కాదేమో...
మన ఇందూరు-మన మేయర్ ట్యాగ్ లైన్ తో పాటు హిందూత్వ ఎజెండాను గల్లీ గల్లీల్లో విస్తృతంగా ప్రచారం చేసి సింగిల్ హ్యాండ్ తో 28 సీట్లను సంపాదించిన అర్వింద్ నడవడిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
 నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల మరుసటిరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ఎదురు చూశాయి అనేక వర్గాలు.. ఈ అంచనకు భిన్నంగా గంభీరంగా, రెండు మూడు అంశాలకే పరిమితము అయ్యారు.28 సీట్లు తక్కువేమీ కాదంటూనే ప్రతిపక్షంలో కూర్చుంటామని సాదా సీదాగా చెప్పి ,మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై ప్రస్తావనకే పరిమితం అవ్వడంపై కూడా చర్చ సాగుతోంది.
సహజమైన నైజానికి భిన్నంగా అర్వింద్ కూల్ గా ,గుంభనంగా, శాంతంగా కనబడడం కూడా ప్రత్యర్థి పార్టీల్లో చర్చకు తావిచ్చినట్లు స్పష్టమైతోంది.ఇది ఎంతదాక పోయిందంటే ఆయనతో తిరిగే కమలం ముఖ్య కార్యకర్తలు సైతం సోమవారంనాడు మేయర్ ఎన్నికలో ఏమి జారుగుతాదో చూడండి అనేదాక పోయింది అర్వింద్ వ్యవహార శైలి..
దీనికి తగ్గట్టుగానే రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. మేయర్ పదవితో పాటు డిప్యూటీ మేయర్ పదవి సైతం కాంగ్రెస్ కే దక్కేలా ఒప్పందం కుదిరించాలని ఇద్దరు ముగ్గురు కొర్పొరేటర్లు నాయకత్వం ముందుఉంచారనే ప్రచారం షికారు చేస్తోంది. దీనికి తోడు అర్వింద్ వ్యవహార శైలి మైండ్ డైవర్షన్ లో భాగమనే చర్చ బీజేపీలో వినవస్తోంది.
అయితే దేనికీ అవకాశం లేకుండా సాఫీగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగడానికి కావాల్సిన పకడ్బందీ వ్యూహంతో రాష్ట్ర నాయకత్వం ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమాలో ఉన్నాయి.
మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లకు కాంగ్రెస్,మజ్లీస్ కూటమి చేరుకున్నా..ఏ టైమ్ ఎట్లుంటదోనని పనిలో పనిగా కారు పార్టీ కార్పొరేటర్ ను కాంగ్రెస్ క్యాంపులో కమ్మేశారు.. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ 3 సీట్ల దూరంలో ఉన్నా కాంగ్రెస్ కూటమికి కంటిమీద కునుకు లేకుండా పోయిందనడానికి ఈ సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. ఏ కోశాన అర్వింద్ కు అవకాశం ఇవ్వొద్దనే అన్ని చర్యలు తీసుకుంటున్నా, బయట మాత్రం అర్వింద్ చివరి నిమిషంలో ఏదో పాచిక వేస్తారనే చర్చ మాత్రం ఆగడం లేదు.దటీజ్ అర్వింద్ ధర్మపురి....


Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన