కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...