Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

జమాల్పూర్ గణేష్....✍︎

బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్ మీడియా కోడై కుసినా..దీన్ని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కాటిపల్లి నగేష్ తో పాటు ఏ ఒక్క ముఖ్య నేత కూడా అదొక ఉత్త ప్రచారమమని కానీ.. అంతా ట్రాష్ అని గానీ బహిరంగంగా మాట్లాడకుండా తప్పించు కోవడం గమనార్హం.. అందుకే బడా నేతనే పరోక్షంగా తోసిపుచ్చాల్సిన దుస్థితిని ఎదుర్కోక తప్పలేదు.. మేయర్ సీటు కోసం ముల్లెలు మారాయని జరుగుతున్న రాద్ధాంతంపై ముక్కు సూటిగా వ్యవహరించే

 సొంత పార్టీ  MLA సైతం బడా నేత నిర్వాకం పట్ల గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.. ఇంకా ఒకరిద్దరు సీనియర్లు మేయర్ సీటు కోసం వారసులను ఎన్నికల బరిలో దించారు..ఈ నేపథ్యంలో బడా నేత యూ టర్న్ తీసుకుని ఎన్నికల ఫలితాల తరువాతనే మేయర్ ఎవరనే అంశాన్ని తెలుస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఆరు నూరైనా..నూరు ఆరైనా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే తన దోస్తుకే పట్టం కట్టడానికే పావులు కదుపుతున్నారు..



Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..