Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

 

✍︎... జమాల్పూర్ గణేష్:-

కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.

    కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి.

ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..

  ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డి,షబ్బీర్ అలీతో దోస్తాన ఉంది ఆయనకు...

ముచ్చటగా మూడు పార్టీల,నాలుగు ప్రభుత్వాల దగ్గర పనులు చక్కబెట్టుకుంటు దూసుక పోతుండు ఆ గండర గండడు.. 

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలతో మంత్రాగమ్ నెరుపుతూ మద్యం,విద్యా   భూ వ్యాపారంలో రారాజుగా వెలుగుతూ కోట్లకు అధిపతి అయ్యిండు..

ఆయనే ఇప్పుడు తెలంగాణ లోనే రాజకీయ ప్రాధాన్యత కలిగిన నిజామాబాద్ మునిసిపల్ కొర్పొరేషన్ మేయర్ పదవికి ఎసరు పెట్టారు..ఆయన ఎవరో కాదు కాటిపల్లి నరేందర్ రెడ్డి..

ఈయన గారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమూ లేదు.. ఏనాడూ కాంగ్రెస్ కోసం నిమిషం పాటు పని చేసింది లేదూ.. కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకం అయ్యింది లేదు.. వాళ్ళ కష్ట సుఖాలు ఎరిగిన వాడు కాదు.. కానీ ఏ మాత్రం కాంగ్రెస్ తో సంబంధం లేని నాన్ కాంగ్రెస్ వ్యాపార దిగ్గజం ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల భుజాల మీద సవారీ చేస్తుండు.. బడా నేతలతో ఉన్న పెగ్గు బంధం,వ్యాపార లావాదేవీల బంధమే.. నరేందర్ రెడ్డిని సామాన్య కార్యకర్తలు నెత్తిన ఎత్తుకుని ఊసురు మంటూ ఊరేగించే దుస్థితికి నెట్టింది..

   30-40 ఏళ్లుగా కష్ట కాలంలో సైతం కాంగ్రెస్ జెండాను దించకుండా,అధికార పార్టీ పెద్దల గాలానికి  చిక్కకుండా నిజాయితిగా నిలబడుతు వస్తున్న సీనియర్ నేతలు పిల్లలు సైతం నిజామాబాద్ మునిసిపల్  కార్పొరేటర్ల ఎన్నికల బరిలో హోరా హోరీ పోరాడుతున్నారు.. ఇలాంటి వాళ్ళను కాదని నరేందర్ రెడ్డి సతీమణినే మేయర్ పీఠం ఎక్కించ డానికి కాంగ్రెస్ బడా నేత పడరాని పాట్లు పడుతుండు..

గల్లీ లీడర్ల నుంచి మొదలుకుని రేవంత్ రెడ్డిని సైతం మచ్చిక చేసుకోవడానికి పడుతున్న ప్రసవ వేదన పడుతోండు కాంగ్రెస్ బడా నేత.. తన దోస్తు కళ్ళల్లో ఆనందం కోసం ఆబడా నేత తిప్పుతున్న రాజకీయ జిత్తుల మారి చక్రం కింద నలిగి పోతోంది ఇందూరు కాంగ్రెస్ కీలక నాయకత్వం..

హతవిధీ ఆ బడా నేత కౌగిలి నుంచి కాంగ్రెస్ ఖతం కాకుండా కాపాడేది ఎవరు?



Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన