Posts

Showing posts with the label Jeevan Reddy

బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

Image
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంట...

ఏమి తక్కువ చేసాము? జీవన్ రెడ్డి ఆరోపణలపై మానాల మోహన్ రెడ్డి కౌంటర్

Image
📍 నిజామాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జీవన్ రెడ్డి పార్టీని విడిచిపోతుండటం బాధాకరమని పేర్కొన్న ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. 👉 రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డి తన వయసుకు, విజ్ఞతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 💬 “మీ పోరాటం సీఎం పై కాకుండా ప్రజా సమస్యలపై ఉండాలి” అని మోహన్ రెడ్డి అన్నారు. వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, గత తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి ప్రతి సారి ఓడిపోయినా కూడా పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. Follow Our WhatsApp Channel

కాంగ్రెస్‌కు గుడ్‌బై దిశగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

Image
Big Breaking కాంగ్రెస్ తో పెనవేసుకున్న బంధం తునాతునకలు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాత తరం నేతగా స్థానాన్ని సొంతం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మనసు ముక్కలయ్యింది. కాంగ్రెస్ తో కటీఫ్ కు ముహూర్తం సమీపిస్తుంది. దీన్ని అక్షరాలా నిజం చేస్తూ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంట్లో, పట్టణంలో పలు చోట్ల ఉన్న ఫ్లెక్సీలను ఆయన అనుచరులు సోమవారం తొలగించారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మాట్లాడిన కొద్దిసేపటికే ఫ్లెక్సీల తొలగింపునకు జీవన్రెడ్డి అనుచరులు రంగంలోకి దిగడం విశేషం. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవడం ఖాయం అయ్యింది.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంధి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. BRS నుంచి గెలిచి కాంగ్రేసు లో స్థానిక MLA సంజయ్ చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అనేక అవమానాలు చవి చూసారు.మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి అనుచరులకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ వైపు మొగ్గు చూపింది. స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్న నేత కావడంతో జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ లీడర్లను రెబల్స్ గా రంగంలోకి దింపారు. ప...