కాంగ్రెస్‌కు గుడ్‌బై దిశగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

Big Breaking కాంగ్రెస్ తో పెనవేసుకున్న బంధం తునాతునకలు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాత తరం నేతగా స్థానాన్ని సొంతం చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మనసు ముక్కలయ్యింది. కాంగ్రెస్ తో కటీఫ్ కు ముహూర్తం సమీపిస్తుంది. దీన్ని అక్షరాలా నిజం చేస్తూ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంట్లో, పట్టణంలో పలు చోట్ల ఉన్న ఫ్లెక్సీలను ఆయన అనుచరులు సోమవారం తొలగించారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మాట్లాడిన కొద్దిసేపటికే ఫ్లెక్సీల తొలగింపునకు జీవన్రెడ్డి అనుచరులు రంగంలోకి దిగడం విశేషం. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవడం ఖాయం అయ్యింది.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంధి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. BRS నుంచి గెలిచి కాంగ్రేసు లో స్థానిక MLA సంజయ్ చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అనేక అవమానాలు చవి చూసారు.మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి అనుచరులకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ వైపు మొగ్గు చూపింది. స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్న నేత కావడంతో జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ లీడర్లను రెబల్స్ గా రంగంలోకి దింపారు. పట్టు పట్టి రెబల్స్ ను గెలిపించిన జీవన్ రెడ్డిని ఏమనలేక అధిష్టానం దిక్కులు చూసింది. మరో వైపు BRS నుంచి వలస వచ్చిన సిట్టింగ్ MLA కే వంత పాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వైఖరి మారదనే అంచనతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. దీనికోసం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న ఆయన ఉగాది పండుగ తరువాత క్యాడర్ అభిప్రాయ సేకరణ పేరిట సమావేశాలకు రెడీ అవుతున్నారు. BRS లో చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జీవన్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ట్రేడ్ మార్క్ గా ఉన్న జీవన్ రెడ్డికి తగిన రాజకీయ విలువ ఇవ్వడానికని BRS అధినేత కేసీఆర్ స్వయంగా జగిత్యాలకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. YS రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు జీవన్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్ మీద పోటీకి దింపారు. మొత్తానికి జీవన్ రెడ్డి పార్టీ మార్పు ఉత్తర తెలంగాణలో రాజకీయ పెను తుఫానుకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్