బీఆర్ఎస్‌ను వీడను.. బీజేపీలో చేరను: జీవన్ రెడ్డి క్లారిటీ

తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీ ఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేసురున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్