ఏమి తక్కువ చేసాము? జీవన్ రెడ్డి ఆరోపణలపై మానాల మోహన్ రెడ్డి కౌంటర్
📍 నిజామాబాద్:
మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
జీవన్ రెడ్డి పార్టీని విడిచిపోతుండటం బాధాకరమని పేర్కొన్న ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.
👉 రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు.
జీవన్ రెడ్డి తన వయసుకు, విజ్ఞతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
💬 “మీ పోరాటం సీఎం పై కాకుండా ప్రజా సమస్యలపై ఉండాలి” అని మోహన్ రెడ్డి అన్నారు.
వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, గత తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు.
జీవన్ రెడ్డి ప్రతి సారి ఓడిపోయినా కూడా పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Follow Our WhatsApp Channel