Posts

Showing posts with the label Telangana Workers Protest

ఆశా వర్కర్లకు పరిష్కారం లేకపోతే చలో అసెంబ్లీ

Image
కామారెడ్డి, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అంగన్వాడీ లు సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయకత్వంలో వారు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. షబ్బీర్ అలీ ఆశా వర్కర్లతో సుమారు గంటకు పైగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్ ముదం అరుణ్ లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కనీస వేతనం 18000 లు అమలు చేస్తామనిఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పని భద్రత హామీ కూడా ఇప్పటికే అమలు కాలేదన్నారు.ఎన్నికల్లో మాతో పని చేయించుకుని పారితోషికం ఇవ్వలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అన్నారు .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 ల పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి బకాయిల విడుదల చేయాలని అన్నారు. పి ఎఫ్ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సుదీర్ఘంగా మాట్లాడిన షబ్బీర్ ఆలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర...

పోలీసు దాడిలో ఆశ వర్కర్లకు గాయాలు

Image
*సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం *భారీ కేట్లను పక్కకు జరిపి గేటు వద్ద ఆందోళన నిర్వహించిన ఆశ వర్కర్లు, CITU నాయకులు *పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశా వర్కర్లు *మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేసే అరెస్టు చేయాలని డిమాండ్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు భారీ కేట్లను తోసేసి కలెక్టరేట్ గేటు ముందుకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్, ముదం అరుణ్ లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుదామని వెళితే పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తత కి దారితీసిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఇష్...

రణరంగంగా మారిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

Image
కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికులు పరిస్థితి ఉద్రిక్తం ధర్నా కార్యక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న మహిళా కార్మికులు మన నిజామాబాద్ అర్బన్.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం ఎ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి వెల్లబోమని బీస్మించుకొని కూర్చుండి పోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపు మూసి ఉంచటంతో వాటిని తెరవాలని చేతులతో బాధదంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడి...

గీత కార్మికుల కోసం బడ్జెట్‌లో ₹5000 కోట్లు

Image
రాష్ట్ర బడ్జెట్లో కల్లుగీత కార్మికులకు 5000 కోట్లు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాను జిల్లాలో ఉన్న గీత కార్మికులు తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు అధ్యక్షతన సోమవారం స్థానిక R&B గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కల్లుగీత కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికులకై ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.గీత కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ని 4000 చేయాలని, ఎక్స్గ్రేషియా ను 10 లక్షలకు పెంచాలని కోరారు. అలాగే సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని తీర్మానం చేసింది సమావేశం. సమస్యల పరిష్కారానికై రేపు హైదరాబాదులోని ఇందిరాపార్క్ లో జరిగే మహా ధర్నా,అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో KGKS జిల్లా కార్యదర్శి చిడుగు శేఖర్ గౌడ్, కోశాధికారి శ్రీరాం గౌడ్, సాయగౌడ్ తో పాటు ఈ సమావేశం వివిధ గీత వృత్తి సంఘ ప్రతినిధులు ఎనుగందుల మురళి,నారా గౌడ్ శ్రీనివాస్, కృష్ణాగౌ...