రణరంగంగా మారిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికులు పరిస్థితి ఉద్రిక్తం ధర్నా కార్యక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న మహిళా కార్మికులు మన నిజామాబాద్ అర్బన్.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం ఎ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి వెల్లబోమని బీస్మించుకొని కూర్చుండి పోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపు మూసి ఉంచటంతో వాటిని తెరవాలని చేతులతో బాధదంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడిపోయారు దీంతో ఫోటోలైన మున్సిపల్ కార్మికులు రెండు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని అలాగే ప్రభుత్వం నుండి తమకు కావాల్సిన దుస్తులు, చెప్పులు కూడా ఇవ్వడం లేదని ఉన్నవారిని తీసివేస్తామని అవసరం ఉన్న వారిని వీధుల్లో ఉంచుతామని ప్రభుత్వం ఇటీవల చెప్పడంతో ఆందోళనకు గురైన వారు తాము ఆందోళన చేపట్టినట్లు వీలైనంత త్వరగా తమ ఆందోళన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళలను 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్